Header Banner

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ అధికారులు చర్యలు! బీఎన్ఎస్ సెక్షన్ల కింద..!

  Tue Apr 15, 2025 17:43        Politics

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బీఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలిసులను లిఖితపూర్వకంగా కోరారు భాను ప్రకాష్ రెడ్డి. ఇక, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఎస్వీ గోశాలపై అసత్య, అబద్దపు ప్రచారాన్ని చేశారు.. కరుణాకర్ రెడ్డి దృష్టికి లోపం ఉంది ఏమో.. ఇష్టం వచ్చినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారు.. నోరు ఉంది కధ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు..

నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయామని కోరాం.. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయి.. గతంలో మేము వైసీపీ హాయంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయట పెట్టామని తేల్చి చెప్పారు. వైసీపీ హాయంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇక, టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది అని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వైసీపీ చేసినా అక్రమాల అన్నిటి పైనా చర్యలు తీసుకుంటుందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదు.. అందరి అవినీతిని బయటకు తీస్తానని చెప్పుకొచ్చారు. నేను లోకల్ లే టీటీడీలో ఆయన కంటే ఎక్కువ సమాచారం నా దగ్గర ఉంటుంది.. భవిష్యత్తులో టీటీడీపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేసినా, మాట్లాడినా ఏ స్దాయి వ్యక్తి పైనా అయినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం.. ఆ దిశగా బోర్డులో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.


ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TTDAction #BhumanaKarunakarReddy #YSRCP #FakeAllegations #BNSSections